చొప్పరి సదానందం కుటుంబానికి మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పరామర్శ
ముత్తారం,(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం పితృవియోగం చెందడంతో, వారి కుటుంబాన్ని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. సదానందం తండ్రి లింగయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న కొత్త శ్రీనివాస్, మంథని ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలోని సదానందం నివాసానికి వెళ్లారు. అక్కడ లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... లింగయ్య మరణం వారి కుటుంబానికే కాకుండా, పార్టీకి కూడా తీరని లోటని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. సదానందం కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచిడి రాముగౌడ్, ముత్తారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదాటి సంపత్ రావు, నూనెటి కృష్ణ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






