చెన్నైకి తిరిగొచ్చిన తమిళనాడు సీఎం విజయ్

17-09-2026 | 09:23am

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా లండన్‌లో చేపట్టిన ఆరు రోజుల అధికారిక పర్యటనను ముగించుకుని, తమిళనాడు ముఖ్యమంత్రి(Chief Minister of Tamil Nadu) సి. జోసెఫ్ విజయ్ గురువారం చెన్నైకి తిరిగి వచ్చారు. తమిళనాడుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం యూకేకు వెళ్లింది. సెప్టెంబర్ 10 రాత్రి UK పర్యటనను(London trip) ప్రారంభించిన ముఖ్యమంత్రి, అధునాతన తయారీ, సాంకేతిక రంగాలలో తమిళనాడును ఒక ప్రముఖ అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వ్యూహాత్మక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. లండన్‌ పర్యటనపై విజయ్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశముందని టీవీకే వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు