31 May, 2026 | 2:55 AM

గుండెల్ని మెలిపెట్టాలనీ

31-05-2026 01:53 AM

టాలీవుడ్‌లో ‘ఎమోషనల్’ ట్రెండ్ 

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ ప్రారంభమైందా? అంటే, ఔననే చెప్పాలేమో! ఎందుకంటే మాస్ హీరోలుగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న స్టార్స్ అంతా ఇప్పుడు సరికొత్త సెంటిమెంట్ కథలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మాస్ ఎలివేషన్స్‌ను పక్కన పెట్టి, కంప్లీట్ ఎమోషనల్ డ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు. 

ఒకప్పుడు కేవలం కమర్షియల్ హంగులు, ఊర మాస్ ఫైట్లు, భారీ యాక్షన్ సీక్వెన్సులకే పరిమితమైన తెలుగు సినిమాలో సరికొత్త మార్పు కనిపిస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్టు దర్శకులు ఎమోషనల్ కథలను తెరకెక్కిస్తున్నారు. ఎమోషనల్ డ్రామా పండితే, బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో స్టార్ హీరోలు కూడా రిస్క్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాల మధ్యే.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే బలమైన భావోద్వేగాలు, మెస్సే జ్ ఓరియెంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ కథల వైపు మన అగ్ర హీరోలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మన స్టార్స్ నటిస్తున్న లైనప్‌ను గమనిస్తే.. టాలీవుడ్‌లో ఇదే ఇప్పుడు సరికొత్త ట్రెండ్ అని మీరూ అనక మానరు. 

సూర్య.. ఫ్యామిలీ ఎమోషన్స్ 

కోలీవుడ్ స్టార్ సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబో లో వస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఒక హోల్స మ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే 45 ఏళ్ల వ యసున్న మాజీ ఇంటర్నేషనల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్‌గా నటిస్తున్నారు. కంటిచూపు మందగిస్తున్నప్పటికీ, అతను మళ్లీ క్రీడల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు.

ఈ క్రమంలో అతని కంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ‘మ్యాడీ’ (మమితా బైజు) అనే యువతి అతనితో ప్రేమలో పడుతుంది. సమాజం వీరి వయసు వ్యత్యాసాన్ని ఎలా చూసింది? వీరి మధ్య ఏర్పడిన భావోద్వేగ బంధం, కుటుంబ విలువలు, ఆశయాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం కుటుంబ భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే హ్యూమర్. 

టాలీవుడ్‌ను టాప్‌లో నిలబెట్టడమే లక్ష్యంగా.. 

కేవలం కత్తులు దూయడం, రక్తం చిం దించడం మాత్రమే కాకుండా.. థియేటర్‌కు వచ్చి న ప్రేక్షకుడి కళ్లు చెమర్చేలా, ఆలోచింపజేసే లా చేయడ మే ఇప్పుడు టాలీవు డ్ టాప్ లీగ్ హీరోల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వైవిధ్య మైన ఎమోషనల్ ట్రెం డ్ టాలీవుడ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి

గుర్తింపు కోసం ‘పెద్ది’ భావోద్వేగ పోరాటం 

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీ రోగా, బు చ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ‘పెద్ది’ సినిమా.. 1980 ల నాటి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ రూర ల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రా మా. ఇందులో రామ్‌చరణ్ ఒక గిరిజన ప్రాంతా నికి చెందిన గ్రామీ ణ క్రీడాకారుడిగా కనిపిస్తారు. సమాజంలో అణచివే తకు గురైన తన ఊరి ప్రజల గుర్తిం పు కోసం, వారి సాధికారత కోసం ఒక సాధారణ యువకుడు మల్టిపుల్ స్పోర్ట్స్ ద్వారా ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్.

ఈ కథ నిజ జీవిత సంఘటనలతోపాటు కల్పిత కథతో రూపొందింది. ఇందులో యాక్షన్ ఎంత ఉంటుందో, దానికి ప్రాణంగా నిలిచే ఎమోషన్స్ ఇంకా బలంగా ఉంటా యి. ఈ మూవీ రన్‌టైమ్ కూడా దాదాపు 3 గంటల 2 నిమిషాలు ఉంది. కథలోని భావోద్వేగాలను, డ్రామా ను పూర్తిస్థాయిలో చూపించడానికే ఈ సుదీర్ఘ నిడివిని లాక్ చేశారు మేకర్స్. 

సందేశాత్మక డ్రామాతో వస్తున్న ‘ఎన్‌బీకే112’ 

స్టార్ డైరెక్టర్ కొరటా ల శివ, నందమూరి బాలకృష్ణ కలయికలో రూపుది ద్దుకుంటున్న పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘ఎన్‌బీకే112’ (వర్కింగ్ టైటిల్). పవర్ మీ ట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఎ మూవ్‌మెంట్’ అనే ట్యా గ్‌లైన్‌తో అనౌన్స్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ మార్క్ సోషల్ మెసే జ్, బాలకృష్ణ ఇమేజ్‌కు సరిపోయేలా ఒక అద్భుతమైన సందేశాత్మక డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కనుం ది. సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూనే.. అభిమానులను ఉర్రూతలూగించే అంశాలు ఇందు లో పుష్కలంగా ఉండబోతున్నాయి. 

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో ‘మెగా158’  

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. గతంలో వీరిద్దరి కాంబో లో వచ్చిన ‘వాల్తేరు వీర య్య’ మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించగా.. ఈసారి మాత్రం సరికొత్త ఎమోషనల్ రైడ్‌ను ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో తండ్రి-కూతు ళ్ల మధ్య ఉండే అప్యాయత, భావోద్వేగాల చు ట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. చిరంజీవి మా ర్క్ నటనకు ఈ సెంటిమెం ట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మెగా మ్యాజిక్ రిపీట్ అవ్వ డం ఖాయంగా కనిపిస్తోంది. 

మనుగడ కోసం ‘జడల్’ తిరుగుబాటు  

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది పారడైజ్’ సినిమా కేవలం భారీ మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా అత్యంత బలమైన ఎమోషన్స్‌తోనూ రూపొందుతోంది. ఈ సినిమా 1980ల నాటి సికింద్రాబాద్ బస్తీల నేపథ్యంలో సాగుతుంది. సమాజంలో తీవ్ర వివక్షకు, అణచివేతకు గురై, తమ ప్రాథమిక హక్కులను కోల్పోయిన ఒక గిరిజన తెగ కథ ఇది.

వ్యవస్థ తమను గుర్తించనప్పుడు, ఏ గుర్తింపూ లేని ఒక సాధారణ వ్యక్తి అయిన ‘జడల్’ అనే పాత్రలో నాని ఎలా తిరుగుబాటు నాయకు డిగా ఎదిగాడు, తన ప్రజల హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేశాడనేది ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో మాస్ యాక్షన్‌కు తగ్గ స్థాయిలో ఎమోషన్స్ కూడా అంతే బలంగా ఉంటాయి. అణచివేతకు గురైన ప్రజల ఆక్రోశం, ఆకలి, మనుగడ కోసం చేసే తిరుగుబాటు వంటి సామాజిక అంశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి.

నాని క్యారెక్టర్ ‘జడల’ లుక్ వెనుక ఒక బలమైన తల్లీకొడుకుల సెంటిమెంట్, భావోద్వేగ బంధం దాగి ఉందనే విషయాన్ని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే.. ‘ది పారడైజ్’ అనేది కేవలం ఫైట్లు, ఎలివేషన్లు మాత్రమే ఉండే కమర్షియల్ మాస్ సినిమా కాదు. ఒక బలమైన సామాజిక సమస్య, ఎమోషనల్ డ్రామా చుట్టూ అల్లిన రస్టిక్, రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ డ్రామా. 

ఎమోషనల్ ‘ఇరుముడి’ 

స్టార్ హీరో రవితేజ, క్లాసిక్ ఎమోషనల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వస్తున్న సినిమా ‘ఇరుముడి’. ఎప్పుడూ ఎనర్జిటిక్, కమర్షి యల్ సినిమాలతో అలరించే మాస్ మహారాజా.. ఈసారి పూర్తి భిన్నం గా అయ్యప్ప మాలధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యప రిచారు. ఈ చిత్రం భక్తి, సెంటిమెంట్, కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగే ఒక హై ఎమోషనల్ రైడ్ అని తెలుస్తోంది. ముఖ్యంగా రవితేజ కెరీర్‌లోనే ఇదొక విలక్షణమైన, హృద యానికి హత్తుకునే సిని మాగా నిలవనుంది. 

 నరేశ్ ఆరుట్ల