చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ కాన్సెప్ట్‌తో
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎంఎస్ కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రెండు ప్రత్యేక గీతాలను కూడా విడుదల చేశారు.
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని ప్ర త్యేక గీతాన్ని కృష్ణ అభిమానుల చేతుల మీ దుగా విడుదల చేశారు. ఈ పాటలో కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి నటించడం విశేషం. కృష్ణసాయి, ప్రీతి సుందర్ ఈ గీతంలో కనిపించగా, రచన- సంగీతాన్ని దర్శకుడు సంజీవ్ మేగోటి అందించారు.
కృతి వర్మ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించిన ను వ్వట్టా సూత్తా ఉంటే అనే మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశా రు. కార్యక్రమంలో తెలంగాణ డీఐజీ రమణారెడ్డి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు, సూపర్ స్టార్ కృష్ణ మేకప్‌మెన్ మాధవరావు, నిర్మాత ఘంటా శ్రీనివాసరావు, డిస్ట్రిబ్యూటర్ నరేంద్ర, పీఆర్‌ఓ శర్మ, డిస్ట్రిబ్యూటర్ సిరాజ్, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాద ర్ గోరి, నటులు కృష్ణసాయి, కృతి వర్మ, ప్రీతి సుందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడు తూ, ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అవుతుందనే నమ్మ కం ఉంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి. అందరిని మె ప్పించే సినిమా ఇది అన్నారు. చిత్ర దర్శకు డు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, 52 మం ది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజు ల్లో ఈ సినిమాను పూర్తి చేశాం.
‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చు ట్టూ కథ తిరుగుతుంది. ఇది హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అని చెప్పారు. నటీమణులు కృతి వర్మ, ప్రీతి సుందర్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






