22 April, 2026 | 12:40 PM

Breaking News

కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •  

నేడు గురునానక్ దేవ్‌జీ జయంతి

15-11-2024 12:00 AM

మానవీయ గురువు

సిక్కుల తొలి పవిత్ర గురువు గురునానక్ 555వ జయంతిని నేడు ప్రపంచవ్యాప్తంగా ఆ మతస్థులు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గురునానక్ జయంతిని ‘గురు పూరబ్’ లేదా ‘ప్రకాశ్ ఉత్సవ్’ పేరుతోనూ పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా ‘కార్తీక పూర్ణిమ’ ఘడియల్లో గురునానక్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పదిమంది సిక్కు గురు వుల జాబితాలో తొలివారైన గురునానక్ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ప్రవచనకర్త, తత్త్వవేత్త.

ఆయన సిక్కుమత స్థాపకులుగా సమానత్వం, దురాచారాలను ఎండ గట్టడం, దేవుడు ఒక్కడే అని ప్రబోధించడం, కులమతరహిత మానవ సమాజం, కరుణ, దయ, శాంతియుత సహజీవనం, ఐక్యత, మానవీయత వంటి సద్గుణాలను ప్రభోదించారు. ఏడు దశాబ్దాల జీవితాన్ని మానవీయ విలువల బోధనలకే అంకితం చేశారు. 

గురునానక్ అమూల్య బోధనల్లో ‘భగవంతుడు ఒక్కడే’ (ఏక్ ఓం కార్) ముఖ్యమైంది. నేటి పాకిస్తాన్‌లోని లాహోర్ సమీప రాయ్‌భోయ్ ది తల్వండీ అనే గ్రామంలో తేదీల ప్రకారం 15 ఏప్రిల్ 1469న గురునానక్ జన్మించారు. 1487లో మాతా సులక్నీని వివాహమాడి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక అంశాలపట్ల ఆసక్తి చూపుతూ సామాజిక అసమానతలు, కులమత విభేదాలను వ్యతిరేకించారు.

16వ ఏట పలు మత గ్రంథాలను ఔపోసన పట్టారు. సంస్కృతం, పార్సీ, హిందీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. 30వ ఏటనే ఆధ్యాత్మిక మేల్కొలుపును పొంది సమానత్వం, కరుణ, భక్తి భావనలను నాటి ప్రజానీకానికి బోధించారు. 70వ ఏట 22 సెప్టెంబర్ 1539న కన్ను మూశారు. మానవీయ విలువకు కట్టుబడి ఆయన చూపిన దారిలో మన జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. 

టొ డా. బుర్ర మధుసూదన్ రెడ్డి