11 April, 2026 | 6:45 AM

ఓటీఎస్‌కు నేడే ఆఖరు

30-11-2024 12:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలోని నల్లా వినియోగదారులు దీర్ఘకాలికంగా జల మండలికి బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్(ఓటీఎస్)  గడువు శనివారంతో ముగియనుంది.

వాస్తవానికి ఓటీఎస్‌కు సంబంధించి అక్టోబర్ నెలాఖ రుకే గడువు పూర్తయినప్పటికీ వినియోగదారుల విజ్ఞప్తి మేరకు నవంబర్ 30 వరకు పొడించారు. అక్టోబర్ నెలాఖరు వరకు రూ.49కోట్ల పెండింగ్ బిల్లులు వసూలవ్వగా.. రెండోసారి ఇచ్చిన గడువులోపు దాదాపు మరో రూ.౪0కోట్ల వరకు వసూలు కావచ్చని అంచనా.