11 April, 2026 | 8:37 AM

హైదరాబాద్ హాస్పిటల్‌పై డీసీఏ దాడులు

30-11-2024 12:12 AM

మలక్‌పేట, నవంబర్ 29: మలక్‌పేటలోని హైదరాబాద్ మల్టీ స్పెషా లిటీ హాస్పిటల్‌లో శుక్రవారం డీసీఏ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. జోఫర్ ఇంజెక్షన్, ఏవిల్ ఇంజెక్షన్, నార్మల్ స్లున్ వంటి మందులను ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అమ్మకాల బిల్లులను స్వాధీనం చేసుకొని, ఎసెన్షియల్ కమొడిటీస్ యాక్ట్ - 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ అధికారులు వెల్లడించారు.