09-12-2025 06:20:42 PM
కోదాడ: మండల పరిధిలోని మంగళ్ తండ గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బాబ్జి నాయక్ విస్తృత ప్రచారం మంగళవారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చే హామీలను బాండు పేపర్‌పై రాసి మరీ ప్రజల్లోకి వెళ్లడం విశేషంగా నిలుస్తోంది. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పేద కుటుంబాల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను తన హామీల్లో ప్రధానంగా పొందుపరిచారు.
తాము గెలిచిన వెంటనే చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని బాబ్జి నాయక్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ప్రచార విధానంతో గ్రామ ప్రజల్లో మంచి స్పందన లభిస్తుండగా, గ్రామ అభివృద్ధి కోసం నిజాయితీగా పని చేయగల అభ్యర్థిగా బాబ్జి నాయక్‌పై విశ్వాసం పెరుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.