calender_icon.png 9 December, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో విజయ్ దివస్ వేడుకలు

09-12-2025 06:18:02 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమాన్ని మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద  తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడల వంచి తెలంగాణను తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ కోసం సబండ వర్గాలు రోడ్డెక్కారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధిక, నాయకులు ఆర్కే రమేష్,ధనవర్ష రాజు, రమేష్, పంజల శ్రీధర్, కుమారస్వామి, చందా గాంధీ, తులసి లక్ష్మణమూర్తి తో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.