10 July, 2026 | 3:48 PM

పదేళ్లు మంత్రిగా ఉండి.. హరీశ్ రావు ఏం చేశారు?

10-07-2026 02:52 PM
  1. హరీశ్ రావు పదేళ్లు మంత్రిగా ఏం చేశారు.. మళ్లీ 3 నెలలు ఎందుకు?
  2. హరీశ్ రావు కట్టిన ప్రాజెక్టే కుంగింది.. దానికి సమాధానం ఏం చెప్తారు?
  3. బీఆర్ఎస్ పార్టీకి రూ. 1400 కోట్లు ఎలా వచ్చాయి?

హైదరాబాద్:  హరీశ్ రావు( Harish Rao) పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు, మళ్లీ 3 నెలలు ఎందుకు? హరీశ్ రావు కట్టిన ప్రాజెక్టే కుంగింది.. దానికి ఏం సమాధానం చెప్పారు? అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) ప్రశ్నించారు. హరీశ్ రావు కాంగ్రెస్ లోకి వస్తానంటే మా కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిధులపై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణల్లో నిజం ఉందని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీకి రూ. 1400 కోట్లు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. 

కొండా సురేఖ, కడియం మధ్య వివాదాన్ని పరిష్కరిస్తాం

మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiyam Srihari) శ్రీహరి మధ్య వివాదాన్ని పరిష్కరిస్తామని సూచించారు. తుంగతుర్తి నియోజకవర్గం వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే ఇద్దరు సీనియర్లను పరిశీలకులుగా నియమించామని మహేశ్ గౌడ్(Mahesh Kumar Goud) వెల్లడించారు. వరంగల్ అంశాన్ని సచిన్ సావంత్ కు, తుంగతుర్తి(Tungaturthi controversy) బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగించామని పేర్కొన్నారు. అందరితో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.