12 July, 2026 | 5:39 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరింది

04-02-2026 12:00 AM

ఒప్పందతో చిన్న తరహా పరిశ్రమలు, సాగు, డెయిరీ రంగాలకు ఊతం

ప్రతీకార సుంకం పెంచింది.. తిరిగి తగ్గించిందీ అమెరికానే..

ఇక ఈ అంశంపై విమర్శకు తావెక్కడుంది?

కేంద్ర మంత్రి పరిశ్రమలశాఖ పీయూష్ గోయల్ 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: ‘భారత్ అమెరికా మధ్య సోమవారం జరిగిన వాణిజ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డెయిరీ, ఐటీ, ఫిషరింగ్, టెక్స్‌టైల్స్, లెదర్ వస్తువుల తయారీ రంగాలు లబ్ధి పొందుతాయి. అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకం ౨౫ శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. తద్వారా దేశానికి చెందిన ఎగుమతిదారులు లాభపడతారు’ అని కేంద్ర మంత్రి పరిశ్రమలశాఖ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ‘ప్రతీకార సుంకాలను విధించింది అమెరికానే, తిరిగి సుంకాన్ని తగ్గించిందీ అమెరికానే. ఇక దీనిలో విమర్శకు తావెక్కడుంద’ని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. న్యూఢిల్లీ నుంచి మంగళవారం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు అనవసరంగా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అసలు దేశ ఆర్థిక వ్యవస్థలను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. తమ పాలన వచ్చాక ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌కు మధ్య ఉన్న సాన్నిహిత్యమే చరిత్రాత్మక ఒప్పందం జరిగిందని కొనియాడారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఒప్పందాన్ని ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకుని కొలిక్కి తీసుకొచ్చారని కొనియాడారు. ఇరు దేశాధినేతల మధ్య సుహృత్ సంబంధాలు ఉండటంతోనే ఈ ఒప్పందం సాకారమైందని అభిప్రాయపడ్డారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం గురించి తమ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని భావించిందని, కానీ.. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన కారణంగా ప్రకటించలేకపోయామని స్పష్టం చేశారు. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.