2 July, 2026 | 3:30 AM

కెఓసిలో కార్మిక సంఘాల నిరసన

02-07-2026 02:25 AM

టేకులపల్లి, జులై 1, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో  కార్మిక సంఘాల (JAC) ఆధ్వర్యంలో బుధవారం యాజమాన్యానికి తమ డిమాండ్లతో మెమోరాండం అందజేశారు. ముందుగా ఎఐటియుసి, ఐఎన్టీయూసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్ సంఘాల నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం స్థానిక కెఓసి మేనేజర్ పేరాల శ్రీనివాస్ కి అందజేశారు.

అనంతరం ఎఐటియుసి బ్రాంచ్ సహయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు, ఐఎన్టీయూసి నాయకులు గుగులొత్ బాషు లు మాట్లాడుతూ..  కరోనా సమయంలో 44 కార్మిక చట్టాలను, 29 చట్టాలు చేసి నేడు నరేంద్రమోదీ 4 లేబర్ కోడ్ లను చేసి అమలు చేయటానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లు వల్ల పర్మినెంట్ కార్మిక వ్యవస్థపై వేటుపడుతుందని తద్వారా కాంట్రాక్టు కార్మికుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని, సమ్మె హక్కు, వేతన సవరణ, ట్రేడ్ యునియన్ చట్టం, పూర్వీకులు సాదించిన చట్టాలు పోయే ప్రమాదం ఉందని ఇవి కార్మికుల మెడపై గొడ్డలి పెట్టు లాంటిదనీ వారు అన్నారు. గత నెల 30తో  11వ వేతన కాలపరిమితి ముగుస్తుందని, కొత్త వేతన సవరణ జరగాలన్నారు.

నేటి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గని కార్మికుల 12 వ వేతన కమిటీ ఏర్పాటు చేయలేదని వెంటనే 12 వ వేతన కమిటీ ఏర్పాటు చేసి జాప్యం చేయకుండా కార్మికులకు నూతన వేతనాలు త్వరిగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుగులోత్ బాసు, కొంగర వేంకటేశ్వర్లు, రమేష్ కుమార్, ఆర్ శ్రీనివాస్, రాచకొండ రాజయ్య, వేంకట నర్సయ్య, వినయ్ బాబు, జంపయ్య, అహ్మద్, దల్ సింగ్, మసూద్ అలి, కనకరాజు, హతీరామ్ తదితరులు పాల్గొన్నారు.