27 August, 2026 | 3:08 PM

ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు

27-08-2026 12:10 PM

తప్పిన పెను ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

రామగిరి, ఆగస్టు 27(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రమైన సెంటీనరీ కాలనీ బస్టాండ్ సమీపంలో గురువారం ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

స్థానికుల కథనం ప్రకారం.. మంథని నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (నెంబర్: TS 22 T 7267) 8వ ఇంక్లైన్ కాలనీ నుండి వచ్చిన కారు సెంటీనరీ కాలనీ బస్టాండ్ వద్ద ప్రయాణికుల కోసం నిలిపి ఉంది.  మంథని వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న బస్సును నేరుగా వచ్చి ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం (బంపర్) తీవ్రంగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులకు గానీ, కారులోని వారికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో పెను ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.