calender_icon.png 1 February, 2026 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వులు పంచే సుమతి శతకం

31-01-2026 01:30:38 AM

అమర్‌దీప్, శైలి జంటగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించారు. టేస్టీ తేజ, మహేశ్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ల గోపికృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట్ శైలజ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఓ మధ్యతరగతి యువకుడి పెళ్లి తంటాలే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. గోదావరి జిల్లాల నేపథ్యం కథతో ఆద్యంతం నవ్వులు పంచనుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్; సినిమాటోగ్రఫీ: ఎస్ హలేశ్; ఎడిటర్: నహిద్ మహమ్మద్.