25 May, 2026 | 3:25 PM

అధికారులకు మొబైల్ యాప్ పై శిక్షణ

13-12-2024 11:14 PM

యాచారం (విజయక్రాంతి): శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం పొందుపరిచిన మొబైల్ యాప్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి కోసం ప్రజాపాలన దరఖాస్తులు సమర్పించిన వారి వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో అధికారులకు వివరించారు. గ్రామాల్లోని అధికారులు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీవో శ్రీలత, తహశీల్దార్ అయ్యప్ప, తదితరులు ఉన్నారు.