ఏరియా వర్క్ షాప్ లో 55వ వార్షిక భద్రత పక్షోత్సవాలు
ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ఇల్లందు ఏరియాలో ఈ నెల 09 నుండి 21 వరకు 55వ వార్షిక భద్రత పక్షోత్సవాలు ఇల్లందు ఏరియా వర్క్ షాప్ నందు ఎన్. దామోదర్ రావు జిఎం ఈ అండ్ ఎం కన్వీనర్, ఏరియా ఇంజనీర్ నరసింహారాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భముగా అధికారులు, ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేపించినారు. ఈ సందర్బంగా రక్షణ కమిటీ వారు మాట్లాడుతూ.. ప్రతి రోజూ అందరు రక్షణ సూత్రాలను పాటిస్తూ పనిచేయాలని అలాగే ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ‘o’ ఆక్సిడెంట్ ఇల్లందు ఏరియా వర్క్ షాప్ ను ఉంచాలని. ప్రతి ఒక్కరూ ఇంటినుండే రక్షణ సూత్రాలు పాటించాలని సింగరేణికి ప్రమాదరహిత ఇల్లందు వర్క్ షాప్ గా తీర్చిదిద్దాలని అన్నారు.
అనంతరం 47వ లెవెల్ సబ్ స్టేషన్ ని తనిఖీ చేసి అలాగే జే.కే కాలనీలోని కాలనీ వాసుల ఇండ్లను సందర్శించి ఎవరైతే ఇంట్లో ఎలక్ట్రికల్ పరికరాలను ప్రమాదరహితంగా ఉంచారో వారికి బహుమతులు అందజేసి వారికి ఎలక్ట్రికల్ ప్రమాదాలపై అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెంబర్స్ పి.అప్పారావు, నరేందర్, మెడికల్ సూపర్డెంట్ రాజ్ కూమార్, నాగరాజు కోదండరాం, మంద గోపాల్, ఏ.ఎస్.ఓ. రామస్వామి, డి.జి.ఎం నాగరాజు నాయక్, డి.ఎై.ఎస్.ఇ పవన్ కుమార్, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి యుగంధర్, ప్రాతినిధ్య సంఘం పిట్ కార్యదర్శి మధు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.






