25 May, 2026 | 3:55 PM

తంగళ్లపల్లిలో రైతులకు 50% రాయితీపై జీలుగా విత్తనాలు

25-05-2026 02:47 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతులకు 50 శాతం రాయితీపై జీలుగా (ధైంచా) విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. తంగళ్లపల్లి కేడీసీఎంఎస్ మరియు జిల్లెల్ల సొసైటీల ద్వారా ఈ విత్తనాల పంపిణీ కొనసాగుతోందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్  తెలిపారు. జీలుగా పంట సాగు వల్ల నేలలో నత్రజని శాతం పెరిగి భూసారం మెరుగుపడటంతో పాటు అధిక చౌడు సమస్యను కూడా కొంతవరకు తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పంట దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. తంగళ్లపల్లి, తాడూర్, కసిబేకట్కూర్, నేరెళ్ల, జిల్లెల్ల రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా పర్మిట్లు పొందిన రైతులు సంబంధిత దుకాణాల్లో విత్తనాలు పొందవచ్చని తెలిపారు. ఒక్కో 30 కిలోల బస్తా రెండు ఎకరాలకు సరిపోతుందని, బస్తా ధర రూ. 2,452.50గా నిర్ణయించారని వెల్లడించారు. విత్తనాలు పొందేందుకు రైతులు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.