25 May, 2026 | 2:26 PM

రేపు జిల్లాలో ఇన్చార్జ్ మంత్రి సీతక్క పర్యటన

13-12-2024 11:10 PM

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈనెల 14న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, బోథ్, నేరడిగొండ మండలలో శనివారం చేపట్టే పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొని, వివిధ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ  సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. మంత్రి సీతక్క నేరడిగొండ బాలికల ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు డైట్ మెనూ ప్రారంభించి విద్యార్ధులతో భోజనం చేస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం పరిచయ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా 63 లక్షలతో నూతనంగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంను ప్రారంభిస్తారని అన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని  ఆదేశించారు.