13 June, 2026 | 2:07 AM

మల్టీ జోన్-1 పరిధిలో ఎనిమిది మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

13-06-2026 01:33 AM

మంథని, జూన్ 12 (విజయ క్రాంతి): మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఎనిమిది మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బదిలీల వివరాలు..ఆసిఫాబాద్ సిసిఎస్ నుండి బుద్దే స్వామి మంథని సర్కిల్కు బదిలీ అ య్యారు. మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఐజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు.

ఖమ్మం సిఎస్బి నుండి ఎల్లయ్య అశ్వాపురానికి బదిలీ అయ్యారు. అశ్వాపురం నుండి అశోక్ ఖమ్మం సిఎస్బికి బదిలీ అయ్యారు. వేణుచందర్ మంచిర్యాల ట్రాఫిక్ నుండి రామగుండం సిఎస్బికి బదిలీ, హన్నాన్ రామగుండం సిఎస్బి నుండి మంచిర్యాల ట్రాఫిక్కు బదిలీ, కృష్ణమూర్తి మెదక్ సిసిఎస్ నుండి మెదక్ రూరల్ సర్కిల్కు బదిలీ, జార్జ్ మెదక్ రూరల్ నుండి ఐజిపి కార్యాలయానికి బదిలీ అయ్యారు. వీరిని వెంటనే రిలీవ్ అయ్యి కొత్త బాధ్యతల్లో చేరవలసిందిగా ఐజిపి ఆదేశాలు జారీ చేశారు.