గంగ వెంచర్‌లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించాలి
మేడ్చల్ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు : జల్లి శైలజ హరినాథ్
మేడ్చల్ అర్బన్ జూన్ 12(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని గంగ గ్రాండ్ యియర్ వెంచర్ లో రిజిస్ట్రేషన్ సమస్త పరిష్కరించాలని తహసిల్దార్ కార్యాలయంలో డివిజన్ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజే శారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని అత్వెల్లి సమీపంలో గల గంగా వెంచర్ లో ప్లాట్ ల రిజిస్ట్రేషన్ ఆగిపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా మేడ్చల్ తహసిల్దార్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించాలని బిజెపి వినతి పత్రం అందించినట్లు తెలిపారు.
తక్షణమే రిజిస్ట్రేషన్ లను ప్రారంభించి సమస్యల పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.మున్సిపల్ పట్టణంలోని గంగా వెంచర్ లో ఎందరో అమాయక ప్రజలు నమ్మి లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ లను నిలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని జల్లి శైలజ హరినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.మేడ్చల్ పట్టణంలో గల గంగా వెంచర్ లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి న్యాయం జరిగేలా రెవెన్యూ అధికారులు తక్షణమే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రూరల్ బిజెపి ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి.బీజేవైఎం జిల్లా నాయకులు బొజ్జ రాఘవరెడ్డి మేడ్చల్.మున్సిపల్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు కానుకంటి వంశీ విజయ్ వంజరి.జాకట ప్రేమ్ దాస్ బిజెపి సీనియర్ నాయకులు ధాత్రిక లక్ష్మణ్.చెరువువు కొమ్ము శ్రీనివాస్ గౌడ్.బి సర్వేశ్వర్ రెడ్డి.ఉపాధ్యక్షులు మైసరి రాజు వంజరి.కార్యదర్శి బండి విష్ణు గౌడ్,మహిళా నాయకురాలు తోట అనిత నాయకులు బొజ్జ వంశీ రెడ్డి.జాకట బాబు రాజు.మహేష్ గౌలికర్. పురుషోత్తం. మల్లికార్జున్. ఎన్‌ఎస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






