మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీ
15-03-2026 12:26 AM
మేడ్చల్, మార్చి 14 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పల్ ఎస్హెచ్‌ఓగా వై రామలింగారెడ్డి, మేడిపల్లి ఎస్‌హెచ్‌ఓగా శంకరయ్య, వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓగా రవిబాబు, సరూర్నగర్ ఎస్‌హెచ్‌ఓగా శ్రీశైలం, జవహర్‌నగర్ ఎస్‌హెచ్ ఓగా సైదులు, మల్కాజిగిరి ఈఓడబ్ల్యుగా భాస్కర్ బదిలీ అయ్యారు. బదిలీలు అమలులోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.




