17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి

29-03-2025 12:19 AM

వారి తీరుపై ట్యాంక్‌బండ్‌పై ట్రాన్స్‌జెండర్ల నిరసన

హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ట్రాన్స్‌జెండర్లకు క్షమాపణ చెప్పాలని ఇటీవల ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా నియామకమైన ట్రాన్స్‌జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై గల శ్రీశ్రీ విగ్రహం ఎదుట వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 50మంది ట్రాన్స్‌జెండర్లను పైలెట్ ప్రాజెక్టు కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించారని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతున్నపుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్; ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్‌లు అవహేళనగా మాట్లాడారని ఆరోపించారు. తమను మనుషులుగా గుర్తించి, తమపై గౌరవంతో సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఈ డ్యూటీలు ఇచ్చారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తమను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు తాము గౌరవప్రదమైన పని చేసుకుంటుంటే అవహేళన పరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.