5 September, 2026 | 8:27 AM

కాలేయ మార్పిడి లేకుండానే చికిత్స

05-09-2026 | 05:35am

యువకుడికి ప్రాణం పోసిన కిమ్స్ వైద్యులు

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఏడాదిగా కడుపులో నీరు చేరే సమస్యతో బాధపడుతున్న 30 ఏళ్ల యువకుడికి కాలేయ మార్పిడి(Liver Transplant) అవసరం లేకుండానే కిమ్స్ హాస్పిటల్స్(KIMS Hospitals), కొండాపూర్ వైద్యులు(Kondapur Doctors) విజయవంతంగా చికిత్స అందించారు. బడ్ -చియారీ సిండ్రోమ్ అనే అరుదైన కాలేయ రక్తనాళ సమస్యను(hepatic vascular issue) గుర్తించి, బెలూన్ వెనోప్లా స్టీ, మెటాలిక్ స్టెంట్ ద్వారా రక్తప్రసరణను పునరుద్ధరించారు.

విశాఖపట్నానికి చెందిన యువకుడికి పలుమార్లు కడుపులో నీరు చే రడంతో గతంలో పలువురు వైద్యులను సం ప్రదించినా అసలు కారణం గుర్తించలేదు. మద్యపాన చరిత్ర కారణంగా కాలేయం దె బ్బతిన్నదని భావించి కాలేయ మార్పిడి అవసరమని సూచించారు. దీంతో కిమ్స్ కొండాపూర్‌ను ఆశ్రయించాడు. ఇంటర్వెన్షనల్ రేడి యాలజిస్ట్ డాక్టర్ మహేష్‌కుమార్ తుమ్ము ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా, ప్రధాన హెపాటిక్ వెయిన్లు మూసుకుపోయినట్లు, యాక్సెసరీ లెఫ్ట్ హెపాటిక్ వెయిన్‌లోనూ రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు.

దీంతో కాలే య మార్పిడికి బదులుగా పాక్షికంగా తెరిచి ఉన్న రక్తనాళం లో బెలూన్ వెనోప్లాస్టీ చేసి స్టెంట్ అమర్చారు. చికిత్స అనంతరం యు వకుడు  డిశ్చార్జ్ అయ్యాడు.  బడ్ -చియారీ సిండ్రోమ్‌లో కాలేయం నుంచి రక్తాన్ని బ యటకు తీసుకెళ్లే హెపాటిక్ వెయిన్లు మూ సుకుపోవడం లేదా తీవ్రంగా ఇరుకుగా మా రుతుంది. దీంతో కాలేయంలో రక్తం నిలిచిపోయి పోర్టల్ హైపర్ టెన్షన్, అసైటిస్, కాలేయ పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు