23 March, 2026 | 4:55 AM

ట్రెండింగ్ చికంకారీ

14-05-2024 12:05 AM

కుర్తీలు మహిళలకు ఎప్పుడూ సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. ఆఫీసులు, అకేషన్లు, కళాశాలలకు వెళ్లేటప్పుడు ధరించడానికి ఇవి తేలిగ్గా ఉంటాయి. వీటిలో ప్రింటెడ్ డిజైన్లు, ఎంబ్రాయిడరీ చేసిన కుర్తీలు ఉంటాయి. వాటిల్లో ఒకటే చికంకారీ కుర్తీ. ప్రస్తుతం ఇవే ట్రెండింగ్‌లో ఉన్నాయి. చికంకారీ కుర్తీని ధరించడం ద్వారా అందమైన లుక్‌ను పొందవచ్చు. ఇవి చూడటానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన అందమైన చికంకారీ కుర్తీలు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. వీటిని మీరు ఆఫీసు నుంచి రోజువారీ వినియోగం వరకు ఎప్పుడైనా ధరించి.. అందమైన రూపాన్ని పొందవచ్చు. ఈ పింక్ అండ్ వైట్ కలర్ కుర్తీ కాటన్, జార్జెట్ ఫాబ్రిక్‌తో తయారు చేశారు. ఇది చర్మానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కుర్తీలను ప్యాంటు, పలాజోలు, లెగ్గింగ్స్, జీన్స్‌తో జత చేయడం ద్వారా మీరు స్టులిష్ లుక్ పొందవచ్చు.