అమరులైన సాయుధ పోరాట యోధులకు ఘన నివాళి
16-09-2026 | 04:54pm
బోథ్,(విజయక్రాంతి): నిజాం కాలంలో పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన అమరులకు బుధవారం సిపిఐ పార్టీ(CPI Party) ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బస్టాండ్ లో పార్టీ జెండాను ఎగరవేసి అమరులను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. వారి పోరాట స్ఫూర్తిని సిపిఐ జిల్లా కన్వీనర్ భారతాల గోవర్ధన్(CPI District Convener Bharatala Govardhan) కొనియాడారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.