4 May, 2026 | 2:44 AM

మృతి చెందిన కార్మికుడికి నివాళి

04-05-2026 01:25 AM

చిట్యాల, మే 3 : రియాక్టర్ పేలి మృతి చెందిన నో స్లాబ్ ఫార్మా కంపెనీ కార్మికుడు బొడ్డు బాలకృష్ణ గౌడ్ కు చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేష్ ఆదివారం నివాళులర్పించారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ శుక్రవారం  నోస్లాబ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి  కాటం వెంకటేశం నివాళులర్పించారు.

ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అండగా నిలబడడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని, నిరుపేద కుటుంబానికి చెందిన  బాలకృష్ణ కుటుంబానికి ఒక కోటి 50 లక్షల రూపాయలు నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చొరవతో  నష్టపరిహారం  ఇప్పించామని, అంతేకాకుండా గాయపడ్డ కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ, చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్  యాదవ్, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, రొండి నరసింహ, మెట్టు వెంకటేశం, బొడ్డు నరసింహ, బొడ్డు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.