4 May, 2026 | 2:43 AM

మరణించిన గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల పరిహారం

04-05-2026 01:25 AM
  1. వర్కర్స్ సంక్షేమానికి కట్టుబడి ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి
  2. చెక్కులు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

ముషీరాబాద్, మే 3 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు మరణించిన గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ కుటుంబాలకు దేశంలోనే తొలిసారి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఐదుగురు గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ కుటుంబాలకు ఆదివారం నాడిక్కడ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నా రు. ప్రమాదవశాత్తు మరణించిన గిగ్, ప్లా ట్ఫామ్ వర్కర్స్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్లాట్ఫామ్ కంపెనీల నుంచి రూ.10 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు మొత్తం ప్రతి కుటుంబానికి మొత్తం రూ.15 లక్షల సహాయం అందజేసినట్లు తెలిపారు.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్(టిజిపిడబ్ల్యు) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాఉద్దీన్ మాట్లా డుతూ ఇది దేశ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉద్యమ చరిత్రలో ఒక గొప్ప విజయమని అన్నారు. డిజి టల్ ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికుల గౌరవం, సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. అలాగే గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్కు సమగ్ర సామాజిక భద్రత, ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు, చట్టపరమైన రక్షణకు నిరంతరపోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.