30 April, 2026 | 2:49 AM

పదవ తరగతిలో త్రివేణి పాఠశాలదే హవా

30-04-2026 01:29 AM

పాల్వంచ ఫస్ట్ ,సెకండ్ స్థానాలు కైవసం 

పాల్వంచ, ఏప్రిల్ 29, (విజయక్రాంతి): బుధవారం వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో పాల్వంచ పట్టణానికి చెందిన త్రివేణి పాఠశాల విజయ దుందుభి మోగించింది. పాల్వంచ త్రివేణి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ వద్ద గల త్రివేణి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి పట్టణంలో విజయకేతనం ఎగురవేశారు.

600 మార్కులకు గాను  579 మార్కులతో బి. మధు శ్రీ ప్రథమ స్థానంలో,  578 మార్కులతో పి. సాయిలోహిత ద్వితీయ స్థానంలో, 570 మార్కులతో ఎం. కీర్తిశ్రీ తృతీయ స్థానంలో 500 లకు పైగా 23 మంది విద్యార్థులు   అత్యుత్తమ మార్కులు సాధించి వారి ప్రతిభను చాటుకున్నారు.

విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల పాఠశాల యాజమాన్యం  హర్షంవ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సీఆర్‌ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ ,విద్యార్థులను,  తల్లిదండ్రులను,పదవ తరగతి బోధించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఈ. రామ్మూర్తి , కిడ్స్ ఇంచార్జ్ జి. కవిత , ఇతర ఇన్చార్జులు  ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.