24 June, 2026 | 4:18 PM

అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిన కారు

24-06-2026 03:35 PM

మలుపు రోడ్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తుల కోరిక

ఎలాంటి ప్రాణహాని జరగలేదు

ఎల్లారెడ్డి పేట జూన్ 24 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన చేపూరి పవన్ కళ్యాణ్ యొక్క బెలోనో కార్ నిన్నటి రోజున అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఎదురుగా లారీ రావడంతో వాటి యొక్క లైట్లు డ్రైవర్ కళ్ళపై పడడంతో, అక్కడ మూలమలుపు ఉండగా బెలోనో కార్ గొల్లపల్లి గ్రామానికి చెందిన పందిర్ల గణపతి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.

వివరాల ప్రకారం.. ఇట్టి కారు కొనుగోలు చేసి మూడు నెలలు అవుతుందని,సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. కారు చెట్టుకు ఢీకొని పంట పొలాల్లోకి దూసుకు వెళ్లి పక్కకు వంగి ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎంపిటిసి వంగాల వసంత కుమార్, మరియు ఆర్కే లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ లాలా మాట్లాడుతూ... ఆర్.అండ్.బి అధికారులు అక్కడ మూలమలుపు ఉన్నందున రోడ్డుకు ఇరువైపులా సేఫ్టీ రేడియం స్టిక్కర్లు అంటించాలని రాత్రి వేళల్లో రోడ్డు కనబడడం లేదని అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని వారు తెలిపారు.