5 March, 2026 | 5:08 AM

మీ కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది

05-03-2026 01:40 AM

కాలువ ఆగే ప్రసక్తే లేదు

సిరిసిల్ల రైతులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భరోసా

పెద్దలింగాపూర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించిన టీఆర్పీ అధినేత

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన మల్లన్న   

రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి4(విజయక్రాంతి) : తంగళ్లపల్లి మండల కేంద్రంలో పెద్దలింగాపూర్ గ్రా మంతో పాటు 12 గ్రామాల రైతుల సాగునీటి కల ఏళ్ల తరబడి అసంపూర్తిగానే మిగిలిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ 11/6లో భాగంగా జరుగుతున్న కాలువ పనులు, కేవలం ఒక్క కిలోమీటర్నర మేర ఆగిపోవడంతో ఆయా గ్రామాల అన్నదాతల ఆశలు అడి యాశలయ్యాయి.

ఎండిపోతున్న పొలాలను చూసి, కన్నీరు మున్నీరవుతున్న రైతుల గొంతుకగా నిలిచేందుకు టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వయంగా రంగంలోకి దిగారు. పెద్దలింగాపూర్ గ్రా మంలో బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన మల్ల న్న, నిలిచిపోయిన కాలువ పనులను పరిశీలించారు. అలాగే కాలువ పనులు పూర్తి చేయాలని 12 గ్రామా ల రైతులు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలను మల్లన్నని విన్నవించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాతల కన్నీళ్లకు వెల కట్టలేం.. కేవలం ఒక్క కిలోమీటర్నర పనులు ఆపి, 12 గ్రామా ల రైతులను ఇబ్బంది పెట్టడం శోచనీయం అన్నారు. ఈ కాలువను పూర్తి చేయించి, రైతులకు నీరందించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని భరోసా ఇచ్చా రు. వెంటనే రాష్ట్రనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి రైతుల సమస్యను వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడి కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పనుల్లో జాప్యం చేస్తూ రైతు ల సాగునీటి హక్కును కాలరాస్తే సహించేది లేదని అధికారులను ఫోన్‌లో హెచ్చరించారు.

ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యపై మల్లన్న స్పందించిన తీరు పట్ల పెద్దలింగాపూర్, చుట్టుపక్కల 12 గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యపై మల్లన్న స్పందించిన తీరు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్,రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్,వుమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్,జిల్లా అధ్యక్షులు మల్లేశం,నాయకులు గీస మధు,సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, జిల్లా నాయకులుపాల్గొన్నారు.

నేరేళ్ల బాధితులకు మల్లన్న పరామర్శ  

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల గ్రామంలో 2017 లో జరిగిన పోలీస్ హింస ఘటనలోని బాధితులను టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వా రింటికి వెళ్లి పరామర్శించారు. ఐదు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచి థర్డ్ డిగ్రీ పద్ధతిలో చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు మల్లన్నతో వాపో యారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నరేవంత్‌రెడ్డి తమను కలిసి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పా రు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో బండి సంజయ్ వచ్చి న్యాయం జరిగే వరకు తమ పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారని, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి, ఎస్‌ఐ రవీందర్ పాత్రపై పూర్తి విచారణ జరిపి ఆ ఇద్దరిపై మారుతి మిగతా పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. బాధితులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని తీన్మార్ మల్లన్న కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతానని హామీ ఇచ్చారు.

శ్రీరామ క్షేత్రం సందర్శించిన తీన్మార్ మల్లన్న

తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం సిరిసిల్ల జిల్లా రామోజీపేటలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రామ క్షేత్రాన్ని భక్తిశ్రద్ధలతో సందర్శించారు.ఆలయానికి చేరుకున్న మల్లన్నకి ఆలయ అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండా లని, రై తులు, కార్మికులు, యువతకు అభివృద్ధి అవకాశాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. కార్యక్ర మంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.