5 March, 2026 | 4:52 AM

బంధువే కీచకుడు!

05-03-2026 01:38 AM

కేజీబీవీ విద్యార్థిని ప్రసవం ఘటనలో మరో మలుపు

నాగర్‌కర్నూల్, మార్చి 4 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టించిన కేజీబీవీ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన పురోగతి కొత్త మలుపు తిరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని ఒక కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గర్భం దాల్చిన విషయాన్ని పూర్తిగా దాచి కడుపునొప్పి పేరుతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వెళ్లి బాత్రూంలోనే బిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం బిడ్డను చెత్తబుట్టలో విసిరేసి వె ళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు చిక్కిన విష యం తెలిసిందే. డిఎస్పి శ్రీనివాసులు మహిళా పోలీసు సిబ్బందితో దర్యాప్తు ముమ్మరం చేశారు. మొదటగా 10 తరగతి పరీక్షలు రాసే క్రమంలో యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి గర్భం దాల్చేందుకు కారణమైందంటూ చెప్పుకోచ్చింది. ఆ యువకుడిని విచారించగా కేవలం చాటింగ్ మాత్రమే చేసినట్లు ఒప్పుకున్నాడు.

బాలికను మరోసారి విచారించగా ఇంటి పక్కనే సమీప బంధువైన గంగరాజు(25) పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. విషయం బయట చెప్పద్దంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. గంగరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని అదుపులోకి తీసుకొని ఈసారి ఇంతగా నేరాన్ని అంగీకరించినట్లు డిఎస్పి తెలిపారు. నిందితుడిపై ఫోక్సో ఆక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి మీడియా ముందు పేర్కొన్నారు.