10 April, 2026 | 11:11 PM

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన— ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు

08-04-2026 11:07 AM
  1. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర
  2. ఇరాన్‌పై దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్
  3. అమెరికా-ఇరాన్‌ మధ్య ఫలించిన పాక్ మధ్యవర్తిత్వం
  4. ఇక ఇరాన్ కు స్వర్ణయుగమన్న ట్రంప్
  5. ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజని ట్రంప్ వెల్లడి

వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) కీలక ప్రకటన చేశారు. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు  ఊపిరి పీల్చుకుంటున్నాయి. ట్రంప్ ఇరాన్ తో 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరాన్ కు మరో రెండు వారాలు గడువు ఇచ్చాడు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులను 2 వారాలు ఆపివేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు.

హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్(Trump Deadline) పొడిగించారు. ఇరాన్ ప్రతిపాదనలపై(Iran Proposals) చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. టెహ్రాన్ తో చర్చలు కీలక దశకు చేరుకున్నాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి 10 సూత్రాల ప్రతిపాదన అందిందని ట్రంప్ చెప్పారు. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచశాంతికి ఇదొక గొప్ప రోజు అని ట్రంప్(Donald Trump) తెలిపారు. ఇరాన్ శాంతిని కోరుకుంటోంది.. యుద్ధాన్ని ఇక చాలనుకుంటున్నారు. హర్మూజ్ జలసంధిపై(Strait of Hormuz) సానుకూల చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తన పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చని ట్రంప్ తెలిపారు. ఇరాన్ తీసుకున్న చర్చలు మధ్యప్రాచ్యానికి 'స్వర్ణయుగం' కావచ్చన్నారు.


ఇవి కూడా చదవండి:

ఇరాన్‌ సైన్యం పనైపోయింది: ట్రంప్

అమెరికాలో 3,100 చోట్ల 'నో కింగ్స్' నిరసనలు — "మా పిల్లలను ఇజ్రాయెల్ యుద్ధానికి పంపం": లక్షల మంది ఆగ్రహం

ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌కు షాకిచ్చిన స్పెయిన్ — సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ

ట్రంప్-మోదీ ఫోన్ కాల్: హోర్ముజ్ జలసంధి భద్రతపై కీలక చర్చ — శాంతికి భారత్ మద్దతు

48 గంటల్లో తెరవకపోతే పేల్చివేస్తాం — ట్రంప్ అల్టిమేటంకు ఇరాన్ కౌంటర్!

ఇరాన్‌‌తో యుద్ధానికి బ్రేక్.. ట్రంప్ సంచలన ప్రకటన

48 గంటల అల్టిమేటం మర్చిపోయారు — ట్రంప్ యూటర్న్, చమురు ధరలు పతనం!

హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి: ట్రంప్

హార్ముజ్ జలసంధి తెరిచి ఉంచాలి — ట్రంప్ 7 దేశాలతో మాటలు, కూటమి ఏర్పాటు సంకేతం!

నాటోపై ట్రంప్ కస్సుబుస్సు

మొజ్తాబా ఖమేనీ ఎంపికపై ట్రంప్ ఆగ్రహం.. ‘ఇరాన్ తప్పు చేసింది’