10 June, 2026 | 2:24 PM

Breaking News

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •  

తగ్గేదేలే అంటున్న ట్రంప్

21-02-2026 11:30 AM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) సుంకాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ప్రపంచదేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తూ ట్రూత్ లో ట్రంప్ పోస్టు చేశారు. ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీం కోర్టు నిన్న తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం గ్లోబల్ టారిఫ్ తక్షణమే అమలులోకి వస్తుందని ఆర్డర్స్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. సుంకాలు, ప్రతీకార సుంకాలపై సుప్రీంకోర్టు నిర్ణయం అమెరికాకు అవమానకరమని ట్రంప్ తెలిపారు.

సుంకాలపై జడ్జీలు ఇచ్చిన తీర్పును చూసి తాను సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ దేశాలపై టారిఫ్ విధింపులో వెనక్కి తగ్గేదే లేదని ఆయన తెల్చిచెప్పారు. భారత్ తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదని తెలిపారు. ట్రంప్ సుంకాలను ఆరుగురు జడ్జిలు వ్యతిరేకించారు. అందులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. ట్రంప్ సుంకాలను అమీకోనీ బారెట్, సోనియా సోటోమేయర్, ఎలెనా కగన్, కేతాంజీ బ్రౌన్ జాక్సన్, జాన్ రాబర్ట్స్, నీల్ గోర్సుచ్ వ్యతిరేకించగా, ముగ్గురు జడ్జిలు క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాఫ్, శామ్యూల్ అలిటో ట్రంప్ సుంకాలను సమర్థించారు.