10 June, 2026 | 3:14 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

హైదరాబాద్‌లో ఉగ్రకుట్రకు ప్లాన్

21-02-2026 12:41 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాలు(Intelligence Agencies) హెచ్చరికలు జారీ చేశాయి. ఎర్రకోట(Red Fort) సహా పలు ఆలయాలు వద్ద ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశ రాజధానిలో దాడులకు ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు ప్లాన్ చేసినట్లు సమాచారం. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా సున్నితమైన, మతపరమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే బహిరంగా ప్రదేశాల్లో  భద్రత పెంచారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్‌లో ఉగ్రకుట్రకు ప్లాన్

ఉగ్రవాదులు హైదరాబాద్‌లో(Hyderabadవిధ్వంసం సృష్టించేందుకు పథకం రచించినట్లు నిఘా వర్గాల అనుమానం వ్యక్తం చేశాయి. లష్కరే తోయిబాకు(Lashkar-e-Taiba) చెందిన ఉగ్రవాది చంచల్‌గూడ  జైలు(Chanchalguda Jailనుంచే ప్లాన్  చేసినట్లు ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాలపై నిఘా పెంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.  నగరంలో వరుస పేలుళ్లకు పథకం వేశారని ముగ్గురు నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. ములాకత్‌కి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.