23 May, 2026 | 8:55 PM

పిడుగు పాటుకు రెండు పశువులు మృతి

23-05-2026 08:03 PM

అచ్చంపేట: అకాల వర్షంతో కూడిన పిడుగుపాటుతో అచ్చంపేట మండలంలోని బుడ్డ తాండలోనీ రైతు కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గిరిజన రైతు మోత్యకు చెందిన రెండు పశువులు పిడుగు పడి మృతి చెందాయి. శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం సమయంలో వ్యవసాయ పొలంలో చెట్టుకు కట్టేసి ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి.

వ్యవసాయం కోసం ఇటీవలే రూ.1.10 లక్షల వ్యయంతో రెండు పశువులను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అప్పు చేసి పశువులను కొనుగోలు చేశానని, అనుకోకుండా పిడుగు పడి అవి మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వ్యవసాయం ఎలా చేయాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని రైతు ప్రభుత్వాన్ని కోరారు.