23 May, 2026 | 9:17 PM

ధాన్యం నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

23-05-2026 08:47 PM

- రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలి. 

- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తాడూరులోని వరి కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం నాణ్యత పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసి, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధాన్యం తడవకుండా నిల్వ చేయడంతో పాటు గిడ్డంగుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిల్లర్లకు సూచించారు.