విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

12-09-2026 | 09:47am

మరోకరి పరిస్థితి విషమం 

ములుగు , (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలం(Wajedu Mandal) పేరూరులో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేరూరు గ్రామానికి చెందిన తుమ్మ అభిషేక్ (23), పంది సమ్మయ్య (50) పోసెట్టి నరేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ రైతుకు చెందిన మిర్చి పంటలో మల్చింగ్ సాగు కోసం పేపర్ పర్చడానికి వెళ్లారు. పని ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో చేను కంచ దాటుతుండగా విద్యుత్ షాక్(Electric shock) గురయ్యారు. కంచకు ఉన్న విద్యుత్ వైర్ కు షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. వెంటనే వారిని 108 అంబులెన్స్ లో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి(Eturunagaram Government Hospital) తరలిస్తుండగా తుమ్మ అభిషేక్, పంది సమ్మయ్య మృతి చెందారు. పోశెట్టి నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పనులకు వెళ్లి ఒకేరోజు ఇద్దరు మృతి చెందడంతో పేరూరులో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు