ప్రకృతి వ్యవసాయంతో పంటలకు మేలు

12-09-2026 | 11:10am

హాజీపూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులనుద్దేశించి జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ మాట్లాడుతూ సహజ వ్యవసాయం పశుపోషణతో అనుసంధానమై ఉంటుందని, ఇందులో బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి వంటివి పొలంలోనే రైతులు తయారు చేసుకోవచ్చని సూచించారు. అనంతరం తయారు చేసే విధానం, బహుళ పంటల సాగు విధానాల గురించి అవగాహన కల్పించారు.

ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని, రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, కూరగాయలు, మెట్ట పంటలైన జొన్న పంటలు సాగు చేయాలని, పంటల మార్పిడి సాగులో భాగంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ 17వ డివిజన్ కార్పొరేటర్ లగిశెట్టి రాజన్న, AMC డైరెక్టర్ మనోజ్, మంచిర్యాల ADA మామిడి క్రిష్ణ, మండల వ్యవసాయ అధికారి క్రిష్ణ, AEOలు మధుప, కొమురయ్య, మౌనిక, కృషి, సఖి, స్వప్న, సేంద్రీయ వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు