అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది

12-09-2026 | 11:07am

మందమర్రి,( విజయక్రాంతి ): అడవులను రక్షించి పర్యావరణాన్ని కాపాడడంలో అటవీశాఖ అధికారుల పాత్ర ఎంతో కీలకమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గాంధారి వనం ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతారామ్, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి హాజరై అటవీ అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం అటవీ ప్రాంతంపై పడుతుందని, ఈ క్రమంలో అడవులు, పర్యావరణాన్ని కాపాడడంలో అటవీశాఖ అధికారులు విశిష్ట కృషి చేస్తారని తెలిపారు. ఆదివాసి గిరిజనుల హక్కులను కాపాడుతూనే అటవీ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అడవులను రక్షించడం ద్వారా భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించడం జరుగుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అందించినట్లు అవుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా అటవీ అధికారి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది సైతం రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి జిల్లా కలెక్టర్ ధృవపత్రాలు అందజేశారు.

మరిన్ని వార్తలు