29 June, 2026 | 3:01 AM

నిండు ప్రాణానికి రెండు చుక్కలు

29-06-2026 01:56 AM

మేడ్చల్ అర్బన్ జూన్ 28 (విజయక్రాంతి):ఐదేళ్ల చిన్నారుల నిండు ప్రాణాలకు రెండు పోలియో చుక్కలు వేయాలి.ఆదివారం మేడ్చల్,గుండ్లపోచంపల్లి,ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణాలలో ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు బస్తీ దావఖానాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో పోలియో చుక్కలు వేశారు.చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రత పైనే ఆధారపడి ఉంటుందని ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు.

మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంలోని బస్తీ ధావాఖాన,ప్రభుత్వాసుపత్రి,ఆధార్ సెంటర్,ఆర్టీసీ బస్టాండ్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలలో కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని దేశం నుండి పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి.మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ.మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చాప రాజు ముదిరాజ్.పాలకుర్తి రాఘవేందర్ గౌడ్.రామన్నగారి సంతోష్ గౌడ్.నడికొప్పు రంజిత్ ముదిరాజ్.వేముల రంజిత్ రెడ్డి.కటిక వినయ్.పత్తి ఆంజనేయులు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి ఆశ వర్కర్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.