5 June, 2026 | 7:32 PM

రెండు గడ్డివాములు దగ్ధం..

05-06-2026 06:22 PM

మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతండ ఆవాస గ్రామం అయిన గొల్లగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో  ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సుమారు లక్ష ముప్పై వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. గోపతండ ఆవాస గ్రామం గోల్లగూడెంలో  పెరుగు శ్రీశైలం, పెరుగు మహేష్ లకు చెందిన రెండు గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన బాధితులకు ఆర్థికంగా ఆదుకోవాలని  కోరారు.