28 July, 2026 | 1:53 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

తడి చెత్త - పొడి చెత్తపై అవగాహన సదస్సు

05-06-2026 06:20 PM

చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు

కోదాడ,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తడి చెత్త - పొడి చెత్తపై 20వ వార్డులో శుక్రవారం అవగాహన సదస్సు  నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, కమిషనర్ రమాదేవి హాజరై మాట్లాడుతూ... ర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను వర్గీకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన పట్టణాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. అలాగే చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మున్సిపాలిటీ తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.