9 May, 2026 | 1:08 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

చెరువులో కారు పడి ఇద్దరు మృతి

16-01-2025 01:57 PM

భువనేశ్వర్: ఒడిశాలోని కోణార్క్ ప్రాంతంలో చెరువులో కారు పడి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. మృతులను బాలసోర్ జిల్లా(Balasore District)కు చెందిన సనాతన్ సేనాపతి, పూరి జిల్లాకు చెందిన సందీప్ మోహపాత్రగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వెళ్తున్న కారు జూనీ స్క్వేర్ సమీపంలోని బైన్షి బజార్ వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడి రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది. సేనాతన్ ముందు సీట్లో కూర్చుండగా సందీప్ కారు నడుపుతున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు మనీష్ సేనాపతి, పాపున్ పరిదా అనే ఇద్దరు వ్యక్తులు కారు వెనుక సీట్లో ఉన్నారని కోణార్క్ పోలీస్ స్టేషన్(Konark Police Station) అధికారి తెలిపారు. శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించి సమీపంలోని గోప్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ సనాతన్, సందీప్ మృతి చెందినట్లు ప్రకటించారు. మృతులు సీటు బెల్టులు ధరించి ఉన్నారని, చెరువులో పడిపోయిన వెంటనే కారు నుంచి బయటకు రాలేకపోయారని ఆయన తెలిపారు.