పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
09-05-2026 11:38 AM
భిక్కనూర్, మే 09(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన బండి రేణుక (సుమారు 35) గిర్ని దుకాణాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






