కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ
కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ
కేరళ సీఎంపై నిర్ణయం ఈ రోజో రేపో
తిరువనంతపురం: ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య లాబీయింగ్ ముమ్మరమవుతున్న నేపథ్యంలో కేరళ తదుపరి ముఖ్యమంత్రిపై( Kerala CM candidate) పార్టీ అధిష్టానం 24 గంటల్లోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. మురళీధరన్ శనివారం తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో UDF సాధించిన ఘన విజయం, సీనియర్ నాయకులు V.D. సతీశన్, రమేష్ చెన్నితాల, K.C. వేణుగోపాల్ మద్దతుదారుల మధ్య లాబీయింగ్, నిరసనల పర్వానికి తెరలేపింది.
ఆయా నాయకులనే కేరళ కొత్త ముఖ్యమంత్రిగా(Kerala's New Chief Minister) ఎంపిక చేయాలని వారు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు కె. మురళీధరన్ మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చలు 24 గంటల్లో పూర్తవుతాయని ఢిల్లీ నుంచి సమాచారం. ఈ రాత్రికి లేదా రేపటికి ఆ నిర్ణయం వెలువడుతుందని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ అధిష్టానం ఫ్లెక్సీలు, పోస్టర్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారు ఎమ్మెల్యేల వైఖరిని, అలాగే మన కూటమి భాగస్వాముల వైఖరిని పరిశీలిస్తారు. చర్చల అనంతరం వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే అంతిమ నిర్ణయం అవుతుంది." అని మురళీధరన్ పేర్కొన్నారు.






