లారీ-కారు ఢీ.. మామ, అల్లుడు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) కొత్తూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి లారీ, కారు ఢీకొన్న దుర్ఘటనలో మామ, అల్లుడు మృతిచెందారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను మహేశ్వరం మండలం జాండగూడెం వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అటు జిల్లాలో శంకర్ పల్లి మండలం(Shankarpalli Mandal) లక్ష్మారెడ్డిగూడ గేట్ వద్ద ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.






