మార్కెట్లోకి రెండు కొత్త పోకో స్మార్ట్‌ఫోన్లు
హైదరాబాద్, డిసెంబర్ 18: మార్కెట్లోకి పోకో రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. పోకో ఎం7 ప్రొ 5జీ, పోకో సీ75 5జీ డివైజ్‌లను విడుదల చేస్తున్నట్లు పోకో ఇండియా కంట్రీహెడ్ హిమాంశు టాండన్ తెలిపారు. పోకో ఎం7 ప్రొ 5జీ అత్యుత్తమ అమోలెడ్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ స్పీకర్లు, 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ కెమె రా, 7.99ఎంఎం స్లిమ్ డ్యూయల్-టోన్ ఫిని ష్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో, లూనార్ డస్ట్, లావెండర్ ఫ్రోస్ట్, ఆలివ్ ట్విలైట్ రంగు ల్లో లభిస్తుంది.
పోకో సీ75 5జీ దేశంలోకెల్లా చౌకైన 5జీ స్టార్ట్‌ఫోన్ అని పోకో తెలి పింది.50ఎంపీ సోనీ కెమెరా, 4-ఇన్-1 పిక్సె ల్ బిన్నింగ్, అడ్వానస్డ్ అపెర్చర్ సెట్టింగ్స్‌లో ఫోటోలు తీయవచ్చని పేర్కొంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం అనువైన ప్రాసెసర్, పెద్ద డిస్‌ప్లే, దీర్ఘకాలిక మన్నికను ఇచ్చే ఫీచ ర్లు ఉన్నాయని కంపెనీ ప్రకటన తెలిపింది. పోకో ఎం7 ప్రొ 5జీ ప్రత్యేక ప్రారంభ ధర రూ. 13,999 (రూ.1,000 బ్యాంక్ డిస్కౌం ట్ లేదా ఎక్సేంజ్ ఆఫర్). పోకో సీ75 5జీ ప్రారంభ ధర రూ.7,999. ఈ స్మార్ట్‌ఫోన్లు డిసెంబర్ 19 (సీ75 5జీ), డిసెంబర్ 20 (ఎం7 ప్రొ 5.జీ) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని పోకో తెలిపింది.




