6 July, 2026 | 9:40 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

ఎస్బీఐ ఎండీగా రామమోహన రావు

19-12-2024 12:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా రామమోహన రావు అమరా నియమి తులవుతున్నారు. మూడేండ్ల పద వీ కాలానికి ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమో దించింది. ఈ పోస్టుకు ఆర్థిక వ్యవహారాల శాఖ రామమోహన రావు పేరును ప్రతిపాదించడంతో క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలి పింది. 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్బీఐలోనే వృత్తి జీవితాన్ని ప్రారంభించిన అమరా వివిధ హోదాల్లో పనిచేశారు.

తాజా నియామకానికి ముందు ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తు న్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించే ఎస్బీఐ భోపాల్ సర్కిల్‌కు చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన రామమోహన రావు కు క్రెడిట్, రిస్క్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో అపార అనుభవం ఉన్నది. ఎస్బీఐ చికాగో బ్రాంచ్, ఎస్బీఐ కాలిఫోర్నియాలకు సీఈవోగా వ్యవహరించారు.