రెండు పెన్నుల కవిత్వం
24-02-2025 12:00 AM
ఆమె కెప్పుడూ హృదయంలో
ఒక సిరాబుడ్డి సిద్ధంగా ఉంటుంది కనుక
సున్నితమైన బుగ్గలను
కాగితాలుగా మార్చుకుని
ఈ కర్కశ వ్యవస్థ చేసిన
పెను గాయాలను తట్టుకోలేక
కనుబొమల కింద పుట్టుకతోనే అమరిన
తన రెండు పెన్నులతో
ఎడతెగని కన్నీటి కవిత్వం రాస్తోంది
ఏక కాలంలో.






