27 August, 2026 | 4:48 PM

నిషేధిత గడ్డి మందు పట్టివేత – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

27-08-2026 03:29 PM

 బెజ్జూర్ ఆగస్టు 27 (విజయక్రాంతి): బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గడ్డి మందును అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్ఐ సర్తాజ్ పాషా తెలిపారు.సులుగుపల్లి గ్రామానికి చెందిన బోర్కుట్ పురుషోత్తం,డేటి సుధాకర్ అను ఇద్దరూ మహారాష్ట్ర రాష్ట్రంలోని అహేరి ప్రాంతం నుంచి నిషేధిత గడ్డి మందును కొనుగోలు చేసి, 20 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు క్యాన్లలో తీసుకువచ్చారు.

సులుగుపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో నిషేధిత గడ్డి మందును విక్రయించేందుకు తరలిస్తున్న సమయంలో, విశ్వసనీయ సమాచారం మేరకు బెజ్జూర్ పోలీసులు కృష్ణపల్లి బ్రిడ్జి వద్ద వారి వద్ద ఉన్న నిషేధిత గడ్డి మందుతో కూడిన 20 లీటర్ల రెండు క్యాన్లను, అలాగే రెండు మొబైల్ ఫోన్లను ఒక స్కూటీని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై  కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.నిషేధిత మందులు, అక్రమ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు లేదా రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.